చైనాను వణికిస్తున్న బెబింగా తుఫాను.. 70 ఏళ్ల తర్వాత రికార్డ్ బద్దలు
బెబింకా తుఫానుదెబ్బకి చైనా వణికిపోతోంది. గంటకు 151 కి.మీ. వేగంతో కదులుతున్న ఈ తుఫాను 70 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టింది.
దిశ, వెబ్డెస్క్: బెబింకా తుఫాను(Typhoon Bebinca) దెబ్బకి చైనా(China) వణికిపోతోంది. గంటకు 151 కి.మీ. వేగంతో ముందుకు కదులుతున్న ఈ తుఫాను ఈ రోజు (సోమవారం) ఉదయం డ్రాగన్ కంట్రీ ఫైనాన్షియల్ స్టేట్ షాంఘైలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే మొత్తం నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను తీవ్రతను అంచనా వేసిన వాతావరణ శాస్త్రవేత్తలు గత 70 ఏళ్లలో షాంఘై (Shanghai) నగరాన్ని తాకిన అత్యంత భయంకరమైన తుఫాన్ ఇదేనని చెబుతున్నారు. సాధారణంగా షాంఘైలోకి తుఫానులు ప్రవేశించడం చాలా అరుదని, ఎప్పుడో 1949లో వచ్చిన గ్లోరియా తుఫాన్ (Gloria Typhoon) తర్వాత ఇదే ఈ నగరంలోకి ప్రవేశించిన అతిపెద్ద తుఫాన్ అనేది నిపుణుల మాట.
కాగా.. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంనే స్థానిక విమానాశ్రయాల్లో (Airports) రాకపోకలు నిలిపివేయడంతో పాటు రైళ్లు ప్రయాణాలను కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో వందల విమానాలు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే.. చైనాలోని హైనాన్ ప్రావిన్స్ని ఈ మధ్యనే యాగి తుఫాను ఇబ్బందిపెట్టింది.