Sheikh Mujibur Rahman :షేక్ హసీనా తండ్రి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిరసనకారులు
దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు కర్ఫ్యూ అమల్లో ఉన్నా బంగ్లాదేశ్‌లో నిరసనకారులు చెలరేగారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు కర్ఫ్యూ అమల్లో ఉన్నా బంగ్లాదేశ్‌లో నిరసనకారులు చెలరేగారు. వందలాది మంది నిరసనకారులు కర్ఫ్యూ ఆంక్షలను ధిక్కరించి రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని ముట్టడించారు. ఈక్రమంలో నగరంలోని షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఢాకా వీధుల్లో బంగ్లాదేశ జాతీయ పతాకాలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు.
దాదాపు 4 లక్షల మంది నిరసనకారులు ఒక్కసారిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనకు దిగారని స్థానిక మీడియా అంచనా వేసింది. ఆదివారం రోజు బంగ్లాదేశ్‌లోని పలు జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో 98 మంది చనిపోయారు. వీరిలో 14 మంది పోలీసు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.