మా కరోనా వ్యాక్సిన్‌తో అరుదైన దుష్ప్రభావాలు : ఆస్ట్రాజెనెకా

దిశ, నేషనల్ బ్యూరో : ‘కొవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ గుర్తుందా ? బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను ‘ఆస్ట్రాజెనెకా’ కంపెనీ దాని పేరుతోనే ఉత్పత్తి చేసింది.

Update: 2024-04-29 19:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘కొవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ గుర్తుందా ? బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను ‘ఆస్ట్రాజెనెకా’ కంపెనీ దాని పేరుతోనే ఉత్పత్తి చేసింది. ఇదే కరోనా వ్యాక్సిన్‌ను అప్పట్లో ‘కొవిషీల్డ్’ పేరుతో బ్రాండింగ్ చేసి మన దేశంలో విక్రయించారు. దేశంలోని కోట్లాది మంది ఈ కరోనా టీకానే తీసుకున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు బ్రిటన్‌లో అలుపెరగకుండా న్యాయపోరాటం చేస్తున్నారు. 2021 ఏప్రిల్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను వేయించుకున్నాక తన మెదడుకు గాయమైందంటూ జామీ స్కాట్ అనే వ్యక్తి బ్రిటన్‌లోని ఓ కోర్టులో పిటిషన్ వేశాడు. అనంతరం ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఇలాంటి కేసులు పెట్టారు. వాటన్నింటిని కలిపి విచారిస్తున్న బ్రిటన్‌లోని ఓ హైకోర్టుకు ‘ఆస్ట్రాజెనెకా’ కంపెనీ తాజాగా ఓ కొత్త విషయాన్ని తెలియజేసింది. ఆస్ట్రాజెనెకా టీకా వల్ల కొందరికి థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ వచ్చి.. చాలా అరుదైన సందర్భాల్లో థ్రోంబోసిస్‌ సమస్య వస్తోందని కోర్టు ఎదుట స్వయంగా కంపెనీ అంగీకరించింది. స్వయంగా కరోనా టీకా కంపెనీయే ఈ ప్రకటన చేయడంతో.. ఈ వ్యాక్సిన్ ప్రతికూలించి చనిపోయిన వారి కుటుంబాలకు, తీవ్రంగా ఆరోగ్యం దెబ్బతిని బాధపడుతున్న వారికి భారీ ఆర్థిక సాయం అందుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News