శరణార్థి శిభిరంపై మరోసారి ఇజ్రాయెల్ దాడి..21 మంది మృతి

గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలన్ని ఖండించినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఆపడం లేదు.

Update: 2024-05-28 16:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలన్ని ఖండించినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఆపడం లేదు. ఈ విధ్వంసాన్ని ఆపాలని యూఎన్ఓ హెచ్చరించిన కాసేపటికే రఫా నగరంలోని శరణార్థి శిభిరంపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 21 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు పౌర రక్షణ అధికారి మహ్మద్ అల్-ముగయ్యిర్ తెలిపారు. శరణార్థి శిబిరంలో తలదాచుకున్న ప్రజలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు వెల్లడించారు. 21 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు అనేక మంది క్షతగాత్రులైనట్టు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ట్యాంకులు రఫా నగరం మధ్యలో ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిఅత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. కాగా, రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ చేసిన దాడిలో 45 మంది మరణించిన విషయం తెలిసిందే.


Similar News