అలర్ట్ : కాంటాక్ట్‌లెన్స్ వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
కళ్లద్దాలకు బదులు కొంత మంది కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: కళ్లద్దాలకు బదులు కొంత మంది కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. కాగా కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్రపోయిన ఓ వ్యక్తి తన కన్ను పోగొట్టుకున్నాడు. కణజాలాన్ని తినేసే ఒక అరుదైన పరాన్నజీవి కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైక్ క్రుమ్ హోల్ట్ అనే యువకుడు ఏడేళ్లుగా కాంటాక్ట్ లెన్స్ లు ధరిస్తున్నాడు.
నిద్రించే సమయంలో వాటిని తొలిగిస్తుంటాడు. కొన్ని సార్లు మర్చిపోతుంటాడు. అలాంటి సందర్భాల్లో స్వల్ప ఇన్ ఫెక్షన్ బారిన వస్తుంటుంది. ఇటీవల కాంటాక్ట్ లెన్స్‌తో పడుకున్న ఆయన పరిస్థితి విషమించింది. అతడి కుడి కంటికి ఆకాంతా అమీబా కెరాటైటిస్ అనే ఇన్ ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఐదుగురు ఐ స్పెషలిస్ట్ లు ఇద్దరు కార్నియా స్పెషలిస్ట్ లను సంప్రదించాకే అసలు రుగ్మత బయటపడింది.