Al Jazeera: కెమెరాలన్నీ తీసుకొని వెళ్లిపోండి.. "అల్‌ జజీరా" మీడియా సంస్థకు ఇజ్రాయెల్‌ సైనికుల వార్నింగ్‌

ఖతార్‌(Qatar)కి చెందిన న్యూస్ బ్రాడ్‌కాస్టర్‌(Broadcaster) 'అల్‌ జజీరా(Al Jazeera)'కి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం భారీ షాకిచ్చింది.

Update: 2024-09-22 21:30 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఖతార్‌(Qatar)కి చెందిన న్యూస్ బ్రాడ్‌కాస్టర్‌(Broadcaster) 'అల్‌ జజీరా(Al Jazeera)'కి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం భారీ షాకిచ్చింది.వెస్ట్‌బ్యాంక్‌(West Bank) రమల్లా(Ramallah)లోని అల్‌ జజీరా ఆఫీసులో ఆదివారం ఇజ్రాయెల్‌ సైనికులు(Israeli forces) సోదాలు చేశారు. ఇజ్రాయెల్‌ సైనికులు భారీగా ఆయుధాలు ధరించి అల్‌ జజీరా కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆఫీసులో ఉన్న కెమెరాలను తీసుకొని వెంటనే అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవాలని ఆ సంస్థ సిబ్బందిని సైనికులు ఆదేశించారు.అనంతరం మీడియా ఆఫీసును మూసివేయాలని అల్‌ జజీరా వెస్ట్‌బ్యాంక్‌ బ్యూరో చీఫ్‌ (Bureau Chief) వాలిద్‌ అల్‌ ఒమారీ(Walid al-Omari)కి నోటీసులు అందించారు. ఛానెల్ ప్రసారాలను 45 రోజుల్లో పూర్తిగా నిలిపివేయాలని సైనికులు ఆర్డర్ జారీ చేసినట్టు తెలుస్తోంది.

కాగా ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ అల్‌ జజీరా కార్యకలాపాలను ఇజ్రాయెల్‌లో 45 రోజుల పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేనెలలో అల్ జజీరా.. తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న జెరూసలేం హోటల్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఆదివారం ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.అయితే తమ సంస్థపై ఇజ్రాయెల్ సైనికులు చేసిన దాడుల్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇది మానవ హక్కులు(Human Rights), సమాచార హక్కు(Right to Information)ను ఉల్లంఘించే(Violates) నేరపూరిత చర్యగా పేర్కొంది . గాజా స్ట్రిప్‌(Gaza Strip)లో ఇజ్రాయెల్ మీడియాపై కొనసాగిస్తున్న అణచివేత అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధంగా ఉందని అల్ జజీరా ఓ ప్రకటనలో తెలిపింది. 


Similar News