Melania Trump on Abortion rights : అబార్షన్ మా హక్కు : మెలానియా ప్రకటన

అబార్షన్ పై పూర్తి హక్కులు మహిళవే అంటూ ట్రంప్(Trump) సతీమణి మెలానియా(Melania) సంచలన ప్రకటన చేశారు

Update: 2024-10-03 06:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : అబార్షన్ పై పూర్తి హక్కులు మహిళవే అంటూ ట్రంప్(Trump) సతీమణి మెలానియా(Melania) సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకాంశాల్లో అబార్షన్ హక్కులు ఒకటి. దీనిపై అధ్యక్ష బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు కమలా హారిస్(Kmala Haris), ట్రంప్ ఇరువురు అబార్షన్ అంశంపై ఇప్పటికే తీవ్రంగా చర్చించారు. కమలా హారిస్ అబార్షన్ హక్కులు మహిళలవే అని, అబార్షన్ హక్కులు రాష్ట్రాలకు ఉండాలని ట్రంప్ వాదించారు. తాజాగా ఈ అంశంపై ట్రంప్ భార్య ఓ సంచలన ప్రకటన చేశారు. 'మహిళ శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు పూర్తిగా ఆమెకే చెందుతుంది. వేరేవరికో ఆమె శరీరంపై హక్కు ఎలా ఉంటుంది? అవాంఛిత గర్భంపై నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకే పరిమితం చేయాలి' అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మెలానియా తను అక్టోబర్ 8న విడుదల చేయబోతున్న 'మెలానియా' అనే పుస్తకంలో రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన ట్రంప్ మాత్రం అబార్షన్ హక్కులు ముమ్మాటికి ఆయా రాష్ట్రాలకే ఉండాలని వాదిస్తున్నారు.

Tags:    

Similar News