ఒక్కసారి కూడా వాష్ చేయకుండా 18 ఏళ్లుగా జీన్స్ ధరిస్తున్న మహిళ!

ఈ రోజుల్లో చిన్నా పెద్దా అని తేడా లేకుండా జీన్స్ ధరిస్తున్నారు.

Update: 2023-05-04 03:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో చిన్నా పెద్దా అని తేడా లేకుండా జీన్స్ ధరిస్తున్నారు. కొంతమంది ఫ్యాషన్‌గా కనిపించడానికి వేసుకుంటే మరికొంతమంది కంఫర్ట్‌గా ఉండడానికీ ధరిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువమంది జీన్స్‌ను 2,3డేస్ తర్వాత ఉతుకుతారు కాదా.. కానీ ఓ మహిళ ఏకంగా 18 ఏళ్ల తర్వాత వాష్ చేసింది. వినడానికీ వింతగా ఉన్నా ఇది వాస్తవం. ఈ సంఘటన ఇంగ్లాండ్ యార్క్ షైర్‌లో జరిగింది. సాండ్రా విల్లిస్ అనే ఓ మహిళ 18 సంవత్సరాల కిందట రెండు డెనిమ్ జీన్స్ పాంట్లను కొనుగోలు చేశారు. ఈ ప్యాంట్లను ఆమె ఏడాదికి ఒక్కసారి మాత్రమే ధరించిందట. అందుకే అవి వాష్ చేయకున్నా.. చాలా క్లీన్‌గా, కొత్తగా ఎలాంటి మరకలు లేకుండా కనిపిస్తున్నాయట. కాగా మరో రెండు సంవత్సరాల పాటు కూడా ఉతకకుండా వాటిని ధరించి రికార్డు సృష్టించాలని సాండ్రా భావిస్తుందట. ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాతో పంచుకోగా.. ‘‘వావ్ మీరు గ్రేట్ మేడమ్, 18 ఏళ్లలో పద్దెనిమిది సార్లు వేసుకుని ఉంటారు అయినా ఎలాంటి మరకలు లేవు, మీకు ఉతకాలని అస్సలు ఆలోచన రాలేదా?’’ అంటూ నెటిజన్లు పలు రకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఈ జీన్స్‌ ప్యాంట్లను వాష్ చేయకున్నా డస్ట్ పట్టకుండా తుడిచి పెడతానని, అలాగే నా దగ్గర మరెన్నో ప్యాంట్స్ ఉన్నాయని, అందుకని వీటిని రెర్‌గా వాడేదాన్నని’ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.  

Tags:    

Similar News