మూత్రం రుచితో లైంగిక భాగస్వామిని గుర్తించే జంతువు! స్టడీలో వెల్లడి
చూడకుండా, వినకుండా కూడా గుర్తించగలవు. A Study finds that the Dolphins can recognize mates by the taste of their urine
దిశ, వెబ్‌డెస్క్ః మనిషికి కుక్క ఎంత అనుకూల జంతువుగా మారిందో, నీటి జంతువుల్లో డాల్ఫిన్ అలాంటి స్థానం కలది. డాన్ఫిలకు బలమైన వినికిడి శక్తి ఉందని, అవి నీటి అడుగున అనేక కిలోమీటర్ల మేర సమాచార విధానాన్ని అమలుచేస్తాయిని అందరికీ తెలుసు. కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఈ ఫ్రెండ్లీ క్షీరదాలు రుచి విషయంలో కూడా అంతే ప్రత్యేకంగా నిలుస్తాయిని పరిశోధకులు కనుగొన్నారు. నిజానికి, డాల్ఫిన్‌లు వాటి కుటుంబ సభ్యులను, స్నేహితులను, లైంగిక భాగస్వాములను చూడకుండా, వినకుండా కూడా గుర్తించగలవు. ఈ క్రమంలో వాటికున్న రుచి చేసే లక్షణమే దీనికి ఆధారమని కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్, స్కాట్లాండ్‌లోని పరిశోధకుల అధ్యయనం ప్రకారం, డాల్ఫిన్‌లు వాటి మూత్రం రుచి ద్వారా ఒకదానికొకటి గుర్తించగలవని కనుగొన్నారు!
స్కాటిష్ ఓషన్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ విన్సెంట్ జానిక్, అతని సహచరులు జాసన్ బ్రూక్, సామ్ వాల్మ్‌స్లీలు నిర్వహించిన ఈ అధ్యయనంలో డాల్ఫిన్‌లు వాటికి తెలిసిన జంతువుల నుండి వచ్చిన మూత్ర నమూనాలను ఎక్కువ కాలం అన్వేషించాయని చెప్పారు. ఒక సమూహంలోని డాల్ఫిన్‌లు మూత్రం, నీటి అడుగున చేసే ఇతర విసర్జనల ఆధారంగా ఇతర డాల్ఫిన్‌లను గుర్తిస్తాయిని తెలిసింది. "ఇది డాల్ఫిన్‌లను రుచి ద్వారా వేరు చేయడమే కాకుండా, డాల్ఫిన్ మెదడులోని సుపరిచితమైన జంతువుల సంక్లిష్ట ప్రాతినిధ్యాన్ని సూచిస్తోంది. అలాగే, రుచి, వాసన అనేవి మానవులకు, మరికొన్ని ఇతర జంతువులకు సంబంధించిన అనుభవాలు అయితే, డాల్ఫిన్‌లు వాటి పరిణామంలో వాసనను కోల్పోయాయి. అవి తాము నిర్దేశించిన పనిని పరిష్కరించడానికి రుచిని మాత్రమే ఉపయోగించగలవు" అని ప్రొఫెసర్ జానిక్ వివరించారు. బెర్ముడా, హవాయిలోని డాల్ఫిన్ ఫెసిలిటీల వద్ద ఈ అధ్యయనం జరిగింది. తర్వాతి అధ్యయనంలో, డాల్ఫిన్‌లు మూత్రం రుచి నుండి ఇతర డాల్ఫిన్‌ల ఆహారాల గురించి సమాచారాన్ని సేకరించగలవా అని పరిశోధకులు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.