Turkey earthquake :17 గంటలు విధితో పోరాడి తమ్మున్ని రక్షించుకున్న చిన్నారి

సిరియాలో శిథిలాల కింద చిక్కుకున్న అక్కాతమ్ముల్ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Update: 2023-02-08 10:57 GMT

దిశ, వెబ్ డెస్క్: టర్కీ- సిరియాలో ఇటీవల సంభవించిన భూకంపం వల్ల 8,300 మందికి పైగా మరణించారు. వేల మంది శిథిలాల్లో చిక్కకున్నారు. మృతుల సంఖ్య నానాటికి పెరుగుతూ పోతోంది. ఇక అక్కడి ప్రభుత్వాలు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భూకంపం వల్ల ఎంతోమంది చనిపోగా.. కొంతమంది అద‌ృష్టంకొద్దీ బయటపడ్డారు. ఈ క్రమంలోనే అప్పుడే పుట్టిన ఓ నవజాత శిశువు శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలతో బయటపడింది. కానీ ఆమె తల్లి మాత్రం చనిపోయింది. భయంకరమైన ఈ భూకంపం బారిన పడ్డ ఓ ఇద్దరు అక్కాతమ్ముల్లకు సంబంధించిన ఓ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. సిరియాకు చెందిన ఓ ఏడేళ్ల బాలిక తన తమ్ముడితో సహా శిథిలాల కింద చిక్కుకుంది. అయితే బాలిక తన తమ్ముడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా తన చేతిని అడ్డుపెట్టి రక్షణ కవచంలా నిలిచింది.

దాదాపు అలా ఒక గంట రెండు.. గంటలు కాదు.. ఏకంగా 17 గంటలు తన తమ్ముడి తలపై తన చేతులు అడ్డుగా పెట్టి రక్షణగా నిలిచింది. అనంతరం ఆ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా.. శిథిలాల కింద ఉన్న అక్కాతమ్ముల్ల ఫోటోను యూఎన్ ప్రతినిధి మహ్మద్ సఫా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''ఈ ఫోటో ను సోషల్ మీడియాలో ఎవరూ కూడా షేర్ చేయలేదు. బహుశా ఆ అక్కాతమ్ముల్లు చనిపోయి ఉంటే చేసేవారేమో. చెడునే కాదు మంచిని కూడా పంచుకోండి'' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తమ్ముడి కోసం ముక్కు పచ్చలారని ఓ పసిపాప పడ్డ కష్టాన్ని చూసి ''లిటిల్ హీరో'' అంటూ ఆ చిన్నారిని నెటిజన్లు పొగుడుతున్నారు.

Tags:    

Similar News