'ఆత్మహత్యా యంత్రం' సహాయంతో వ్యక్తి మృతి.. పలువురి అరెస్ట్
స్విట్జర్లాండ్(Switzerland) లో ఆత్మహత్యా యంత్రం(Suicide Pode) సహాయంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
దిశ, వెబ్ డెస్క్ : స్విట్జర్లాండ్(Switzerland) లో ఆత్మహత్యా యంత్రం(Suicide Pode) సహాయంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి చనిపోవడానికి సహాయం చేశారంటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. దక్షిణ స్విట్జర్లాండ్ లోని మేరీషాజన్ ప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి సార్కో(Sarco Pod) (ఆత్మహత్యా యంత్రం) సహాయంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు సమాచారం అందుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్ళి ఆత్మహత్యకు ప్రేరేపించారనే అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకొని, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే సార్కోగా పిలవబడే ఆత్మహత్యా యంత్రం చిన్న పేటిక మాదిరిగా ఉంటుంది. ఆ పేటికలో పడుకున్న తర్వాత బయటి నుండి ఒకరు స్విచ్ ఆన్ చేస్తే పేటికలోకి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ విడుదలయ్యి.. నిముషాల్లో ఆ వ్యక్తి మరణిస్తాడు. కాగా ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశం కూడా సార్కోకు అనుమతి ఇవ్వలేదు.