స్కూల్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది విద్యార్థులు మృతి
చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి యశన్‌పూ ప్రాంతంలోని ఓ బోర్డింగ్ స్కూల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి యశన్‌పూ ప్రాంతంలోని ఓ బోర్డింగ్ స్కూల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో అప్పటికే 13 మంది విద్యార్థులు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులందరూ కూడా మూడో తరగతి చదువుకున్న విద్యార్థులని చైనా మీడియా సంస్థలు తెలిపాయి.
#UPDATE Thirteen people have died in a school dormitory fire in central China's Henan province, the official Xinhua news agency reported Saturday. "Rescuers arrived at the scene quickly and the flames were extinguished at 11:38 p.m.," Xinhua said.https://t.co/x8PpOMnXWg
— AFP News Agency (@AFP) January 20, 2024