ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో ఓ యువతి హల్‌చల్..నెట్ దగ్గరకొచ్చి అలా..?! (వీడియో)
ఆమె లక్ష్యం ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. Climate volunteer disrupts French Open semi-final.
దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ 2022లో శుక్రవారం, క్రొయేషియాకు చెందిన మారిన్ సిలిక్, నార్వేజియన్ కాస్పర్ రూడ్ మధ్య పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్ జరిగింది. అయితే, గేమ్ మధ్యలో ఒక మహిళ కోర్టులోకి ప్రవేసించి, హల్‌చల్ చేసింది. ఇలాంటి ఘటనలు సాధారణమే కానీ, ఇక్కడ జరిగిన అంతరాయం మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. రసవత్తరంగా కొనసాగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్ మధ్యలో పర్యావరణ కార్యకర్త ఫిలిప్ చాట్రియర్ టెన్నిస్ కోర్టులోకి దూసుకొచ్చి, తనని తాను నెట్‌కు ఇనుమ తీగతో కట్టుకుంది. ఆటంకంతో ఆట 15 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ ఆమె లక్ష్యం ప్రపంచాన్ని ఆలోచింపజేసింది.
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నివేదికను ప్రస్తావిస్తూ - 'మనకు 1028 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి' అనే సందేశాన్ని రాసిన టీ-షర్టును ధరించి, తన మెడను తీగతో నెట్‌కు కట్టి, తన కుడి చేతిని పైకి లేపింది. పర్యావరణం నాశనమైపోతోందని, దాన్ని మనం కాపాడుకోవాలని ప్రచారం చేస్తున్న ఫిలిప్ చాట్రియర్‌ను గార్డులు బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లి, పోలీసులకు అప్పగించారు. శుక్రవారం జరిగిన సెమీ-ఫైనల్‌లో గెలుపొందిన కాస్పర్ రూడ్ ఈ సంఘటనపై స్పందిస్తూ, ఈ పరిస్థితిపై ఎలా స్పందించాలో తనకు అర్థం కాలేదని చెప్పాడు. "ఇది కొంచెం క్లిష్ట పరిస్థితి. ఇంతకు ముందు నాకు ఎప్పుడూ జరగలేదు" అన్నాడు. ఇక, ఇటీవల ఫ్రాన్స్‌లోని మోనాలిసా పెయింటింగ్‌పై కేక్‌తో దాడిచేసిన యువకుడి తర్వాత ఇప్పుడు ఫిలిప్ నిరసన వ్యవహారం మరోసారి ప్రపంచాన్ని కదిలించగా, పర్యావరణం మార్పుపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సంఘటనలు సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.