చనిపోయిన రెండు గంటల తరువాత బ్రతికిన 16 ఏళ్ల యువకుడు
ఓ 16 ఏళ్ల యువకుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించిన రెండు గంటల తర్వాత మళ్లీ బతికాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఓ 16 ఏళ్ల యువకుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించిన రెండు గంటల తర్వాత మళ్లీ బతికాడు. ఈ విచిత్ర సంఘటన యూఎస్ లోనని టాక్సాస్‌లో చోటు చేసుకుంది. స్థానిక జిమ్‌లో రాక్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు గుండె ఆగిపోవడంతో సామీ బెర్కోను ఆస్పత్రికి తీసుకువచ్చారు. కాగా చికిత్స అనంతరం యువకుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో ఆ 16 ఏళ్ల యువకుడు బ్రతికాడు. "అతని గుండె చప్పుడు చూసిన ఆ అనుభూతి, దానికి మాటలు రావడం లేదు...అక్కడే నిలబడ్డాం" అని యువకుడి అమ్మ అన్నది.