న్యూజిలాండ్ అగ్నిపర్వత పేలుడు ఘటనలో బాధితులకు నష్టపరిహారంగా రూ.49.72 కోట్లు
న్యూజిలాండ్‌లో 2019లో అగ్నిపర్వత పేలుడు ఘటన వలన 22 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా బాధితులకు $6 మిలియన్ల(రూ.49.72 కోట్ల) నష్టపరిహరాన్ని అందించనున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: న్యూజిలాండ్‌లో 2019లో అగ్నిపర్వత పేలుడు ఘటన వలన 22 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా బాధితులకు $6 మిలియన్ల(రూ.49.72 కోట్ల) నష్టపరిహరాన్ని అందించనున్నారు. పూర్తివివరాల్లోకి వెళితే, 2019న, న్యూజిలాండ్‌లో స్ట్రాటోవోల్కానో ద్వీపం అయిన వాకారి/ వైట్ ఐలాండ్ విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వత ద్వీపం పేలుడు సమయంలో దాదాపు 47 మంది పర్యాటకులు ఉన్నారు. భయంకరమైన విస్ఫోటనం కారణంగా 22 మంది చనిపోగా, మిగతావారు తీవ్రంగా కాలిన గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ కేసులో తాజాగా బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని ద్వీపాల యజమానులు, హెలికాప్టర్ సంస్థ, న్యూజిలాండ్‌లోని అగ్నిపర్వతాలను పర్యవేక్షిస్తున్న జీఎన్‌ఎస్ సైన్స్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.
ఆక్లాండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో, న్యాయమూర్తి ఇవాంజెలోస్ థామస్ మాట్లాడుతూ, ఈ విపత్తు కారణంగా బాధితులు శారీరకంగా, మానసికంగా క్షోభకు గురయ్యారు, ఇంకా చాలా మంది శారీరంపై ఆయా ప్రమాద గుర్తులను కలిగి ఉన్నారని అన్నారు. ఘటన తర్వాత అగ్నిపర్వత బూడిద నుండి తప్పించుకోడానికి ద్వీపంలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. న్యూజిలాండ్ చరిత్రలో ఇది "చెత్త ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి" అని న్యాయమూర్తి అభివర్ణించారు.