కూలిన బంగారు గని.. 22 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో : భారీ వర్షాల కారణంగా ఉత్తర టాంజానియాలోని బంగారు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి.
దిశ, నేషనల్ బ్యూరో : భారీ వర్షాల కారణంగా ఉత్తర టాంజానియాలోని బంగారు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 22 మంది కార్మికులు చనిపోయారు. దేశ రాజధాని డోడోమాకు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరియాడి జిల్లాలోని అక్రమ గోల్డ్ మైన్‌లో ఈ ప్రమాదం సంభవించింది. చనిపోయిన 22 మంది కార్మికుల డెడ్‌బాడీస్‌ను కూడా రెస్క్యూ టీమ్స్ వెలికితీశాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బంగారు ఖనిజం ఉందని రెండు, మూడు వారాల క్రితమే గుర్తించారు. అయితే ప్రభుత్వం నుంచి భౌతిక, పర్యావరణ భద్రతాపరమైన అనుమతులు ఇంకా లభించలేదు. ఆ పర్మిషన్స్ మంజూరు కాకముందే అక్రమంగా మైనింగ్ ప్రారంభించారని విచారణలో వెల్లడైంది. ఈ ప్రమాదం సంభవించిన బంగారు గనిని అధికారులు సీజ్ చేశారు.