వరల్డ్ ఫేమస్ లవర్… లిటరల్లీ ఫీల్ ద పెయిన్

          ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14న వస్తున్నాడు. ఇన్నిరోజులు ఈ సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. కానీ, ఈ ఒక్క థియాట్రికల్ చాలు. సినిమా హైప్ పెరిగేందుకు. మళ్లీ విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డిని మించి బ్లాక్‌బస్టర్ కొడతాడనేందుకు. నలుగురు అమ్మాయిలతో సాగే ప్రేమకథను థియేటర్లకు వచ్చి ఫుల్ ఫిల్‌గా ఫీల్ అవ్వచ్చని చెప్పినట్లు ఉంది థియాట్రికల్ ట్రైలర్. పార్ట్‌నర్, వైఫ్, ఫాంటసీ, గర్ల్ ఫ్రెండ్‌లతో ఓ […]

Update: 2020-02-06 06:17 GMT

‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14న వస్తున్నాడు. ఇన్నిరోజులు ఈ సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. కానీ, ఈ ఒక్క థియాట్రికల్ చాలు. సినిమా హైప్ పెరిగేందుకు. మళ్లీ విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డిని మించి బ్లాక్‌బస్టర్ కొడతాడనేందుకు. నలుగురు అమ్మాయిలతో సాగే ప్రేమకథను థియేటర్లకు వచ్చి ఫుల్ ఫిల్‌గా ఫీల్ అవ్వచ్చని చెప్పినట్లు ఉంది థియాట్రికల్ ట్రైలర్. పార్ట్‌నర్, వైఫ్, ఫాంటసీ, గర్ల్ ఫ్రెండ్‌లతో ఓ వ్యక్తి ఎలా ఉంటాడు? ఎలా ప్రేమిస్తాడు? చివరికి ఏం అవుతుందన్నది కథ అయి ఉండొచ్చు.

‘ఈ ప్రపంచంలో నిస్వార్ధమైనదేదైనా ఉందంటే అది ప్రేమొక్కటే.. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండక్షరాలు ఓ సునామీనే రేపగలవు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా ‘నా గుండెకి తగిలిన దెబ్బకి ఆ మాత్రం పెయిన్ తెలవకుండా ఉండాలంటే ఫిజికల్‌గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలే’ అనే డైలాగ్‌తో పూర్తయింది. సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్న రాశీ ఖన్నా డైలాగ్ ‘ మై మైండ్, మై హార్ట్ ఈజ్ జస్ట్ బ్లీడింగ్ ‘ లవ్‌లో పెయిన్‌ను చూపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ అద్భుతంగా ఉందని, తెలంగాణ యాసలో వచ్చే హీరో డైలాగ్స్ కిరాక్‌గా ఉన్నాయని చెబుతున్నారు ఫ్యాన్స్. లవ్, జాయ్, పెయిన్, ఎమోషన్ అన్ని కలగలిసి ఫుల్‌మీల్స్ లా ఉందంటున్నారు నెటిజన్లు.

‘ఇది నా చివరి ప్రేమ కథ అని నాకు తెలుసు.. అందుకే ఇలాంటి లవ్‌స్టోరీని చేయాలనుకున్నా అన్నిరకాల ప్రేమలతో నిండిన వరల్డ్ ఫేమస్ లవర్ మీ కోసం ‘ అంటూ ట్వీట్ చేశాడు హీరో విజయ్ దేవరకొండ.

Tags:    

Similar News