ప్రమాదపు అంచున వరల్డ్ బిగ్గెస్ట్ డ్యాం..
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచలోనే అతిపెద్ద డ్యాం ప్రస్తుతం ప్రమాదపు అంచున ఉన్నది. యాంగ్జీ నదిపై చైనా నిర్మించిన ఈ డ్యామ్‌లో వరల్డ్‌లోని పెద్దదిగా రికార్డు సృష్టించింది. డ్రాగన్ కంట్రీ ఈ డ్యాం ద్వారా లక్షల ఎకరాలకు నీరందించడమే కాకుండా.. 22,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాదిలో చైనాలో కుండపోత వర్షాలు కురిసాయి. దీంతో ఈ డ్యాంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు గేట్లు ఎత్తి నీటికి కిందకు […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచలోనే అతిపెద్ద డ్యాం ప్రస్తుతం ప్రమాదపు అంచున ఉన్నది. యాంగ్జీ నదిపై చైనా నిర్మించిన ఈ డ్యామ్‌లో వరల్డ్‌లోని పెద్దదిగా రికార్డు సృష్టించింది. డ్రాగన్ కంట్రీ ఈ డ్యాం ద్వారా లక్షల ఎకరాలకు నీరందించడమే కాకుండా.. 22,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాదిలో చైనాలో కుండపోత వర్షాలు కురిసాయి. దీంతో ఈ డ్యాంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాదకరస్థాయికి చేరుకుంది.
ఇప్పటికే పలుమార్లు గేట్లు ఎత్తి నీటికి కిందకు విడుదల చేశారు. అయినప్పటికీ అందులో నీటి నిల్వ ఏమాత్రం తగ్గలేదు. ఒకవేళ డ్యాం గేట్లు పూర్తిగా ఎత్తాల్సివస్తే దాదాపు 40కోట్ల మంది చైనీయులు వరద బారిన పడే ప్రమాదమున్నట్లు అక్కడి అధికారులు హెచ్చరించారు.