‘విధులకు హాజరుకాకుండా ఉద్యోగులను అడ్డుకుంటాం..’

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా స్టీల్‌ప్లాంట్ వద్ద కార్మిక, విపక్ష పార్టీ నేతల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం ప్రభుత్వ విధానాలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మంగళవారం తెల్లవారుజాము వరకూ ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాకుండా నేడు స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉక్కు పరిరక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. విధులకు […]

Update: 2021-03-08 20:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా స్టీల్‌ప్లాంట్ వద్ద కార్మిక, విపక్ష పార్టీ నేతల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం ప్రభుత్వ విధానాలకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మంగళవారం తెల్లవారుజాము వరకూ ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాకుండా నేడు స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉక్కు పరిరక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. విధులకు ఉద్యోగులు హాజరుకాకుండా అడ్డుకుంటామని జేఏసీ ప్రకటించింది.

Tags:    

Similar News