నవంబర్‌లో మహిళా ఐపీఎల్: గంగూలీ
దిశ, స్పోర్ట్స్: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ను ఈ ఏడాది యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించడంతో మరోసారి మహిళా ఐపీఎల్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. బిగ్‌బాష్ మహిళల లీగ్‌లాగానే ఐపీఎల్‌లోనూ మహిళా లీగ్ ప్రవేశపెట్టాలని చాన్నాళ్ల నుంచి డిమాండ్ ఉంది. గతేడాది ప్రయోగాత్మకంగా మూడు జట్లతో టీ20 లీగ్ నిర్వహించారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముందు మహిళల లీగ్ నిర్వహించింది. అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్‌కు ఆటంకం ఏర్పడటంతో మహిళల లీగ్ నిర్వహిస్తారా లేదా అనే […]
దిశ, స్పోర్ట్స్: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ను ఈ ఏడాది యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించడంతో మరోసారి మహిళా ఐపీఎల్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. బిగ్‌బాష్ మహిళల లీగ్‌లాగానే ఐపీఎల్‌లోనూ మహిళా లీగ్ ప్రవేశపెట్టాలని చాన్నాళ్ల నుంచి డిమాండ్ ఉంది. గతేడాది ప్రయోగాత్మకంగా మూడు జట్లతో టీ20 లీగ్ నిర్వహించారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ముందు మహిళల లీగ్ నిర్వహించింది. అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్‌కు ఆటంకం ఏర్పడటంతో మహిళల లీగ్ నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఒక ప్రకటన చేశారు. ‘మహిళల ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుంది. మహిళా క్రికెట్‌కు బీసీసీఐ చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పుడున్న మూడు జట్లతో మరో జట్టును చేర్చి మొత్తం 4 జట్లతో వారి ఐపీఎల్ నిర్వహిస్తాం. నవంబర్ 1 నుంచి 10వ తేదీల మధ్య నిర్వహించేందుకు యోచిస్తున్నాం’ అని గంగూలీ స్పష్టం చేశారు.