భారత్‌కు ‘సెమీస్’ గండం.. పురుషుల బాటలోనే మహిళలు..!
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు సెమీస్ కలిసి రావడం లేదు. ఇటీవల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, నిన్న పురుషుల హాకీ జట్టు, తాజాగా మహిళల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్లోనే భంగపాటుకు గురయ్యారు. నిన్న క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించి సెమీ ఫైనల్ చేరిన మహిళల హాకీ జట్టు నేడు ఆర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో 2-1గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ పసిడి ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. మ్యాచ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు సెమీస్ కలిసి రావడం లేదు. ఇటీవల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, నిన్న పురుషుల హాకీ జట్టు, తాజాగా మహిళల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్లోనే భంగపాటుకు గురయ్యారు. నిన్న క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించి సెమీ ఫైనల్ చేరిన మహిళల హాకీ జట్టు నేడు ఆర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో 2-1గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ పసిడి ఆశలు మరోసారి గల్లంతయ్యాయి.
మ్యాచ్ ప్రారంభంలో గుర్జిత్ కౌర్ తొలి గోల్ కొట్టడంతో ఇండియా ఆధిక్యంలో నిలువగా.. ఆ తర్వాత ఆర్జెంటీనా ప్లేయర్లు వరుసగా గోల్స్ కొట్టారు. వారిని అడ్డుకోవడంలో భారత అథ్లెట్లు విఫలం కావడంతో మరోసారి సిల్వర్ మెడల్ చిక్కినట్టే చిక్కి చేజారింది. కాగా, కాంస్య పతకం కోసం జరిగే పోరులో గ్రేట్ బ్రిటన్‌తో భారత జట్టు మరోసారి తలపడనుంది.