ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఇంటి ఎదుట మహిళల ధర్నా

దిశ, తెలంగాణ బ్యూరో : చేనేతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ నేతన్నల ఆత్మహత్య బాధిత మహిళలు ఢిల్లీలోని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నేతన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేస్తే స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య బాధిత కుటుంబాలకు, అనారోగ్యంతో మృతి చెందిన నేతన్నల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, […]

Update: 2021-08-06 06:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : చేనేతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ నేతన్నల ఆత్మహత్య బాధిత మహిళలు ఢిల్లీలోని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నేతన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేస్తే స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య బాధిత కుటుంబాలకు, అనారోగ్యంతో మృతి చెందిన నేతన్నల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారి కుటుంబ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కనీస అవసరాలు తీరక వృత్తిని వదిలి ఇతర వృత్తులు చేయడానికి సిద్ధంగా ఉన్నా అసంఘటిత నేత కార్మికులకు ఐదు లక్షల రీహాబిలిటేషన్ ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జాతీయ నేతల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్, మహిళలు సుంకి సరోజ, సుమతి, నిర్మల, రేణుక, సంధ్య, నాగరాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News