కొండచిలువనూ ఉతికేసిన మహిళ..!
దిశ, వెబ్ డెస్క్: కొండ చిలువను టీవీల్లోనూ, ఫోనుల్లోనూ చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కలలో కూడా అవే కనిపిస్తూ భయపెట్టేస్తుంటాయి కొందరిని. అలాంటిది ఎమిలీ అనే మహిళ ఏకంగా కొండ చిలువను వాషింగ్ మెషీన్ లో వేసి ఉతికేసింది. అయినా చిలువకు ఏమి కాలేదు. చాలా సేఫ్ గా ఉంది. అంత పెద్ద కొండ చిలువని అలా శుభ్రం చేయడం ఈజీ అని కాదు. అది వాళ్ళ పెంపుడు జంతువు అంతకన్నా కాదు. అసలు అది వాషింగ్ మెషిన్ లోకి ఎలా వెళ్లిందో కూడా […]
దిశ, వెబ్ డెస్క్: కొండ చిలువను టీవీల్లోనూ, ఫోనుల్లోనూ చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కలలో కూడా అవే కనిపిస్తూ భయపెట్టేస్తుంటాయి కొందరిని. అలాంటిది ఎమిలీ అనే మహిళ ఏకంగా కొండ చిలువను వాషింగ్ మెషీన్ లో వేసి ఉతికేసింది. అయినా చిలువకు ఏమి కాలేదు. చాలా సేఫ్ గా ఉంది.
అంత పెద్ద కొండ చిలువని అలా శుభ్రం చేయడం ఈజీ అని కాదు. అది వాళ్ళ పెంపుడు జంతువు అంతకన్నా కాదు. అసలు అది వాషింగ్ మెషిన్ లోకి ఎలా వెళ్లిందో కూడా పాపం ఆ మహిళకు తెలియదు. ఫ్లోరిడా లోని వెస్ట్ పామ్ బీచ్ (west palm beach, florida) లో జరిగిన ఘటన ఇది.
ఎమిలీ ఉదయాన్నే బెడ్ షీట్లు, బట్టలు వాషింగ్ మెషిన్ (washing machine) లో వేసి స్విచ్ ఆన్ చేయలేదు. కొన్ని గంటల తర్వాత ఆన్ చేసింది. లోడ్ అయ్యాక బట్టలు, బెడ్ షీట్లు ఆరేయడానికి డోర్ ఓపెన్ చేసింది. ముందు రంగు రంగుల్లో ఉన్న బెడ్ షీట్ (bed sheet) ను చూసింది. ఇలాంటిది వేయలేదు కదా అనుకుంటూ బయటకు తీసింది.
అంతే… తన చేతుల్లో బరువుగా, వెచ్చగా ఉన్న చిలువను చూసి ఆమెకు గుండె ఆగినంతపనయ్యింది. కెవ్వున అరిచి.. దానిని వాషింగ్ మెషిన్ లోనే పడేసి.. అపార్టుమెంటు మేనేజ్మెంట్ కు కాల్ చేసింది. వెంటనే వారు ఆ ఫ్లాట్ కు చేరుకొని కొండచిలువను బంధించారు.
చిలువ బతికే ఉండటంతో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు. అసలు డోర్లన్నీ మూసి ఉన్నా ఆ కొండ చిలువ వాషింగ్ మెషిన్ లో ఎలా దూరిందబ్బా…? అన్ని తిప్పలు తిరిగినా ఎలా బతికి బట్టల్లానే బయటకొచ్చింది…?? అందరి కళ్లుగప్పి లోపలికి వచ్చిందంటే ఇది ఎంత టక్కు టమారి కొండనో అనుకుంటున్నారు అక్కడివాళ్లు.
దీనినిబట్టి ఇక్కడా అక్కడా అని లేకుండా మూలనున్న కన్నాల దగ్గర నుండి టాయిలెట్ కమోడ్స్ (toilet commodes) వరకు ప్రతిచోటా ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ పాములు ఎక్కడ ఎప్పుడు ప్రవేశిస్తాయో… ప్రాణాలు ఎలా హరిస్తాయో చెప్పలేము.