హుజురాబాద్‌లో వికటించిన టీఆర్ఎస్ ప్లాన్.. బీజేపీకి బిగ్ ప్లస్(వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం కాస్తా గ్రౌండ్ లెవల్లో వికటించింది. సీల్డ్ కవర్లు చేరిన విషయం సోషల్ మీడియాతో పాటు  ప్రచారం విస్తృతం కావడంతో హుజురాబాద్ నియోజకవర్గంలోని పల్లెల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఓటుకు ఆరు వేల రూపాయల చొప్పున పల్లెల్లో కొంత మందికి పంచి మరికొంత మందికి పంచకపోవడంతో ఆగ్రహానికిలోనైన మహిళలు రోడ్డెక్కారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన నియోజక […]

Update: 2021-10-28 00:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓటర్లను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం కాస్తా గ్రౌండ్ లెవల్లో వికటించింది. సీల్డ్ కవర్లు చేరిన విషయం సోషల్ మీడియాతో పాటు ప్రచారం విస్తృతం కావడంతో హుజురాబాద్ నియోజకవర్గంలోని పల్లెల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఓటుకు ఆరు వేల రూపాయల చొప్పున పల్లెల్లో కొంత మందికి పంచి మరికొంత మందికి పంచకపోవడంతో ఆగ్రహానికిలోనైన మహిళలు రోడ్డెక్కారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన నియోజక వర్గంలోని వీణవంక మండలం గంగారం గ్రామంలో చోటు చేసుకుంది. మాకెందుకు డబ్బులు పంచలే.. స్థానికంగా ఉన్న నాయకులే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధిష్టానం కవర్లు పంపినా కావాలనే మాకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే తమకు అన్యాయం చేశారంటూ ఊరి సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Tags:    

Similar News