పార్టీని వీడిన మహిళా మావోయిస్టు.. ఎస్పీ సునీల్‌దత్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, భద్రాచలం: మావోయిస్టుల వేధింపులు, చిత్రహింసల కారణంగా చర్ల ఎల్‌వోఎస్‌కు చెందిన ఒక మహిళా మావోయిస్టు సుక్కి పార్టీని విడిచిపెట్టినట్లుగా సమాచారం ఉందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకులు ఆమెను పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. మావోయిస్టుల వైఖరి నచ్చక భవిష్యత్తులో మరికొంతమంది పార్టీని వీడే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే మావోయిస్టు నాయకులు భయపడుతున్నారని తెలిపారు. పార్టీలో పనిచేస్తున్న మహిళలు, పిల్లల పట్ల మావోయిస్టు నాయకుల […]
దిశ, భద్రాచలం: మావోయిస్టుల వేధింపులు, చిత్రహింసల కారణంగా చర్ల ఎల్‌వోఎస్‌కు చెందిన ఒక మహిళా మావోయిస్టు సుక్కి పార్టీని విడిచిపెట్టినట్లుగా సమాచారం ఉందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకులు ఆమెను పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. మావోయిస్టుల వైఖరి నచ్చక భవిష్యత్తులో మరికొంతమంది పార్టీని వీడే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే మావోయిస్టు నాయకులు భయపడుతున్నారని తెలిపారు. పార్టీలో పనిచేస్తున్న మహిళలు, పిల్లల పట్ల మావోయిస్టు నాయకుల వ్యవహార శైలి ఐఎస్ఐ తీవ్రవాదుల మాదిరిగానే ఉన్నాయననారు. మావోయిస్టు పార్టీ బారినుంచి గిరిజన పిల్లలను, మహిళలను, ఇతర సభ్యులను కాపాడాటానికి అన్ని మానవ హక్కుల సంఘాలు, బాలల హక్కుల సంఘాలు, మహిళా సంఘాల కార్యకర్తలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అరణ్యం వీడి భార్యాబిడ్డలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించడానికి మావోయిస్టులు లొంగిపోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.