ఈజీ మనీ కోసం మహిళల పాడుపని.. వాట్సాప్ లో ఫోటోలను పంపి

దిశ, ఏపీ బ్యూరో : కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదించాలని ఆ మహిళలు ప్లాన్ వేశారు. వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని భావించారు. అందుకు వాట్సాప్‌ను వేదికగా చేసుకున్నారు. వెంటనే మకాం మార్చేశారు. సొంత రాష్ట్రమైన కర్ణాటకలోని బళ్లారి నుంచి తిరుపతికి షిఫ్ట్ అయిపోయారు. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో రహస్యంగా హైటెక్ వ్యభిచారం నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మీప్రియ అనే మహిళలు స్నేహితులు. వీరు గతంలో […]

Update: 2021-07-21 04:39 GMT

దిశ, ఏపీ బ్యూరో : కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదించాలని ఆ మహిళలు ప్లాన్ వేశారు. వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని భావించారు. అందుకు వాట్సాప్‌ను వేదికగా చేసుకున్నారు. వెంటనే మకాం మార్చేశారు. సొంత రాష్ట్రమైన కర్ణాటకలోని బళ్లారి నుంచి తిరుపతికి షిఫ్ట్ అయిపోయారు. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో రహస్యంగా హైటెక్ వ్యభిచారం నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మీప్రియ అనే మహిళలు స్నేహితులు. వీరు గతంలో వ్యభిచారం చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడ్డారు. మరింత డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బళ్లారి నుంచి తిరుపతికి షిఫ్ట్ అయిపోయారు. జీవకోన శ్రీనగర్ కాలనీకి చెందిన సాయి చరణ్ ద్వారా రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

వాట్సాప్‌ ద్వారా యువతుల ఫోటోలను విటులకు పంపుతారు. వారికి నచ్చిన అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారు ఎక్కడకు రావాలి అనేది మెుత్తం సాయి చరణ్ చూసుకుంటాడు. ఇందుకు గానూ బెంగళూరు, గుడివాడల నుంచి యువతులను రప్పిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే సోమవారం ఎస్బీఐ కాలనీలో ఈ ముఠాగుట్టు రట్టు చేశారు పోలీసులు. సీఐ శివప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసుల బృందం లక్ష్మిప్రియ, స్వప్నలు వ్యభిచారం నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. లక్ష్మీప్రియ, స్వప్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరో నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడులలో పలువురు యువతులను రక్షించినట్లు సీఐ శివప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.

Tags:    

Similar News