సాగనీ..విజయ పరంపర !
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళా టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా విజయ పరంపర కొనసాగుతోంది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే సెమీస్‌లో అడుగుపెట్టిన మహిళా జట్టు శనివారం శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టింది. గత మూడు మ్యాచుల్లో బ్యాటింగ్ వైఫల్యం బెంబేలెత్తించినా..ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ సమిష్టిగా రాణించి మహిళా ఆటగాళ్లు ఔరా అనిపించారు. మెల్‌బోర్న్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక..భారత బౌలర్లు రాణించడంతో […]
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళా టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా విజయ పరంపర కొనసాగుతోంది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే సెమీస్‌లో అడుగుపెట్టిన మహిళా జట్టు శనివారం శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టింది. గత మూడు మ్యాచుల్లో బ్యాటింగ్ వైఫల్యం బెంబేలెత్తించినా..ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ సమిష్టిగా రాణించి మహిళా ఆటగాళ్లు ఔరా అనిపించారు.
మెల్‌బోర్న్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక..భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక బ్యాట్స్ఉమెన్లలో కెప్టెన్ చమారి ఆటపట్టు (33), కవిషా (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. భారత బౌలర్ రాధా యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇక 114 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు..ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న షెఫాలీ వర్మ మరోసారి తన దూకుడును ప్రదర్శించి కేవలం 34 బంతుల్లో 47 పరుగులు సాధించింది. స్టార్ బ్యాట్స్‌ఉమన్ స్మృతి మంధాన (17), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (15) కూడా రాణించడంతో భారత జట్టు మరో 5.2 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా నాలుగు విజయాలతో భారత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.
కాగా, నాలుగు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రాధా యాదవ్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపిక చేశారు.