యూరిన్ శాంపిల్‌తో ప్రెగ్నెన్సీ క్యాన్సర్ టెస్ట్..!‌‌

దిశ, వెబ్‌డెస్క్ : మూత్ర పరీక్ష ద్వారా గర్భసంచి క్యాన్సర్ ఉందో లేదో తెలిపే ‘నాన్ ఇన్వాసివ్ టెస్ట్’ మైక్రోస్కోప్ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిద్వారా ఖచ్చితమైన ఫలితాలు వెల్లడవుతాయని వారు చెబుతున్నారు. అందుకోసం 103 మంది క్యాన్సర్ వ్యాధి బాధితులు, 113 మంది రుతుస్రావం ఆగిపోయిన మహిళల యూరిన్ శాంపిల్స్ సేకరించి పరిశోధనలు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే, గర్భసంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలను ఈ మైక్రోస్కోప్ పరికరం 91.70శాతం ఖచ్చితత్వంతో కనుగొన్నదని […]

Update: 2021-02-12 12:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మూత్ర పరీక్ష ద్వారా గర్భసంచి క్యాన్సర్ ఉందో లేదో తెలిపే ‘నాన్ ఇన్వాసివ్ టెస్ట్’ మైక్రోస్కోప్ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిద్వారా ఖచ్చితమైన ఫలితాలు వెల్లడవుతాయని వారు చెబుతున్నారు.

అందుకోసం 103 మంది క్యాన్సర్ వ్యాధి బాధితులు, 113 మంది రుతుస్రావం ఆగిపోయిన మహిళల యూరిన్ శాంపిల్స్ సేకరించి పరిశోధనలు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే, గర్భసంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలను ఈ మైక్రోస్కోప్ పరికరం 91.70శాతం ఖచ్చితత్వంతో కనుగొన్నదని మాంచెస్టర్ పరిశోధకులు స్పష్టంచేశారు.

Tags:    

Similar News