కొండపై నుంచి జారిపడ్డా.. ఆ లెగ్గింగ్స్ చిరిగిపోలే! అమెజాన్‌పై లేడీ రివ్యూ వైరల్
దిశ, ఫీచర్స్ : అమెరికన్ ఉమన్ – అమెజాన్ షాపింగ్ రివ్యూ నెట్టింట వైరల్ అయింది. జూలై 2020లో తన లెగ్గింగ్స్‌పై ఆమె చేసిన రివ్యూ.. మరొకరికి హెల్ప్‌ఫుల్ కావడంతో పాటు ప్రస్తుత ఫొటో అప్పటి సిచ్యువేషన్‌ను మ్యాచ్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో హిలేరియస్ కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి. i think about this twice per week pic.twitter.com/MCjFadQwRH — emmy (@emmycantread) November 6, 2021 అమెరికాకు చెందిన కోరీ హెచ్ అమెజాన్‌లో […]
దిశ, ఫీచర్స్ : అమెరికన్ ఉమన్ – అమెజాన్ షాపింగ్ రివ్యూ నెట్టింట వైరల్ అయింది. జూలై 2020లో తన లెగ్గింగ్స్‌పై ఆమె చేసిన రివ్యూ.. మరొకరికి హెల్ప్‌ఫుల్ కావడంతో పాటు ప్రస్తుత ఫొటో అప్పటి సిచ్యువేషన్‌ను మ్యాచ్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో హిలేరియస్ కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.
i think about this twice per week pic.twitter.com/MCjFadQwRH
— emmy (@emmycantread) November 6, 2021
అమెరికాకు చెందిన కోరీ హెచ్ అమెజాన్‌లో 13.39 డాలర్లకు రేపోజ్ లెగ్గింగ్ పెయిర్ కొనుగోలు చేసింది. ట్రెక్కింగ్ చేసే సమయంలో కొండ మీది నుంచి జారిపడినా.. బండలు, చెట్ల మధ్య ఇరుక్కుపోయినా ఈ లెగ్గింగ్స్ కొంచెం కూడా చిరగకపోగా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయని తెలుపుతూ ఆన్లైన్ మార్కెటింగ్ బ్రాండ్ అమెజాన్‌లో రివ్యూ ఇచ్చింది. వీటిని అన్ని కలర్స్‌లో రీ ఆర్డర్ చేస్తానని చెప్పింది. ‘ట్రెక్కింగ్ టైమ్‌లో పైకి ఎక్కేందుకు చాలా భయపడ్డాను. పర్వతం ఎక్కే క్రమంలో జారిపోయాను. కానీ నా లెగ్గింగ్స్ కొంచెం కూడా చిరిగిపోలేదు’ అని ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చిన కోరీ.. ‘ఇప్పుడే కొనుగోలు చేయండి’ అని కస్టమర్లకు సజెస్ట్ చేసింది.
కాగా కోరీ రివ్యూ నిజంగానే చాలా మందికి హెల్ప్ చేసిందని ఇటీవల కామెంట్ చేసిన కింబర్లీ ఆర్ కెల్లీ అనే కస్టమర్.. కోరీ మాదిరిగానే ట్రెక్కింగ్ చేస్తున్న పిక్ షేర్ చేయడం, అది కూడా రేపోజ్ లెగ్గింగ్స్ కావడంతో ఈ పిక్చర్ కాస్తా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘మౌంటెయిన్ స్లైడింగ్ లేడీ చెప్పింది అక్షరాల నిజం. అమెజాన్‌లో కొనుగోలు చేసిన రేపోజ్ లెగ్గింగ్స్ చాలా బాగున్నాయి. ఇలాంటివి ఐదు కొనుగోలు చేసిన నేను నిజంగా అదృష్టవంతురాలిని’ అని ట్వీట్ చేసింది.
— squirt stain (@squirtstain) November 7, 2021