Ukku Satyagraham: గద్దర్ నటించిన ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా విడుదల డేట్ అనౌన్స్..!
విప్లవ కవి, ప్రజా గాయకుడు దివంగత గద్దర్ (Gaddar) గతేడాది ఆగస్టులో 6 వ తేదీన కన్నుమూశారు.
దిశ, వెబ్‌డెస్క్: విప్లవ కవి, ప్రజా గాయకుడు దివంగత గద్దర్ (Gaddar) గతేడాది ఆగస్టులో 6 వ తేదీన కన్నుమూశారు. అపోలో ఆస్పత్రి(Apollo Hospital)లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు(Gummadi Vithal Rao). ఉమ్మడి మెదక్ జిల్లా(Medak District) తూఫ్రాన్(Tufron)కు చెందిన లచ్చమ్మ(Lachamma), శేషయ్య(Seshaiah) దంపతులకు జన్మించిన ఈయన విశాఖ ఉక్కు(Visakha Steel) తెలుగు వారి హక్కు నినాదంతో రూపొందిన ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో నటించాడు. ఈ మూవీలో ఈయన మూడు పాటలు పాడారు. పలు సన్నివేశాల్లో కూడా నటించారు.
ఈయన నటించిన చివర మూవీ ఇదే. అయితే తాజాగా గద్దర్ నటించిన ఈ చిత్ర డేట్‌ను ప్రకటించారు. ఈ నెల (నవంబరు) 29 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుందట. తాజాగా ఉక్కు సత్యాగ్రహం విడుదల తేదీకి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యారెడ్డి(Director Sathya Reddy) మాట్లాడారు. విప్లవ కవి గద్దర్ కవి నటించి చివర నవంబరు 29 వ తారీకున రిలీజ్ అవ్వనుందని తెలిపాడు. తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసిన లక్ష్మి నారాయణతో పాటు ఎంతో మంది ఉద్యమకారులని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రం కథానాయకుడి రోల్ గద్దర్ తీర్చిదిద్దారు. ఈ చిత్రం నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఉద్యమ మూవీ అని వెల్లడించారు.