MLC Kavitha: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్
నారాయణపేట జిల్లా (Narayanapet District) మాగనూరు (Maganuru) జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా (Narayanapet District) మాగనూరు (Maganuru) జడ్పీ హైస్కూల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ (BRS) నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తారనే సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy), అనుచరులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే అక్రమ అరెస్ట్‌లపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోందని అరోపించారు.
మాగనూరు (Maganur) జడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే కాంగ్రెస్ సర్కార్ (Congress Government) అక్రమ అరెస్టులకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy), కార్యకర్తల ముందస్తు అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. తెలంగాణ (Telangana) గడ్డ.. పోరాటాల పురిటి గడ్డ అని నినదించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజల తిరుగుబాటును అణిచివేయాలని అనుకోవడం మూర్ఖత్వమని కవిత అన్నారు.