KTR : రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేది ఎన్నడు ? : కేటీఆర్

కాంగ్రెస్(Congress) కరకుగుండెలు కరిగేది ఎన్నడు ?రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేది ఎన్నడంటూ బీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

Update: 2024-11-27 05:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్(Congress) కరకుగుండెలు కరిగేది ఎన్నడు ?రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేది ఎన్నడంటూ బీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. యాసంగి పోయి వానాకాలం వచ్చిందని, వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చిందని నాడు గల్లా ఎగరేసిన రైతు నేడు నేలచూపులు చూస్తున్నాడని, నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మన్యూనతతో తండ్లాడుతున్నడని కేటీఆర్ ఆవేదన చెందారు. రుణం తీరక,కొత్త రుణం లేక, అప్పు పుట్టక రైతన్న ఆగమైతుండని, రైతుభరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదని, రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి..రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి.. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అంటున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు, కౌలురైతులు ఎదురుచూస్తున్నారని, రూ.12 వేల రైతుభరోసా కోసం

రైతుకూలీలు ఎదురుచూస్తున్నారన్నారు. రెండు పంటలకేనా రైతుబంధు ? మూడో పంటకు ఇవ్వరా అని అధికారం ఆనాడు కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో కోసం బీరాలు పలికిండ్రని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చకా మొదటిపంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తారో ఎప్పటినుండి ఇస్తారో అసలు ఇస్తారో, ఇవ్వరో ఇప్పటివరకూ స్పష్టత లేదన్నారు. రైతుభరోసా సాయం సున్నా రుణమాఫీ అరసున్నా రైతుబీమా గుండుసున్నా అని..కాంగ్రెస్ కరకుగుండెలు కరిగేది ఎన్నడు ?రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేది ఎన్నడని కేటీఆర్ ప్రశ్నించారు.  

Tags:    

Similar News