Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం 2 వారాల గడువు
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం 2 వారాల గడువు ఇచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో బెయిల్ కోసం నిందితుడు మేకల తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (Tirupattana Bail Petition) పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరికొంత సమయం కోరింది. దీంతో కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు ఇస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ల ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ డిసెంబర్ 18కి వాయిదా వేసింది.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్నకు గత ఆక్టోబర్ ప్రారంభంలో బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రైమరీ ఎవిడెన్స్ ఉన్నాయని ఈ దశలో బెయిల్ ఇవ్వడం కుదరదంటూ పేర్కొంది. దీంతో ఆయన బెయిల్ కోసం తిరుపతన్న సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై గత నెల 24న విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇవ్వకపోవడానికి గల కారణాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 27కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరుపగా కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం గడువు కోరింది.