దిశ, వెబ్ డెస్క్ : భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవానికి ఏటా అందించనున్న కోటి తలంబ్రాల(Koti Talambralu)ను సిద్దం చేసే పనులు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం అచ్చుతాపురంAchuthapuram లోని శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 14వ సారి రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు మహా యజ్ఞ కోసం వేసిన రెండు ఎకరాల పంట పొలంలో వరి కోతను కోసి కోటి తలంబ్రాలుగా రాములోనికి సమర్పించింది సాంప్రదాయ బద్దంగా అచ్చుతాపురంలో కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి వానరసేన వేష ధారణలతో శ్రీకారం చుట్టారు.
రాములవారి వానర సైన్యం వేషధారణలో కళాకారుల బృందం రాముడి పాటలను, పద్యాలను ఆలపిస్తూ రాములోరికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం వరి పంటను కోసి, నూర్పిడి చేసి వండ్ల గింజలను రాములోరి పాదాల ముందు శ్రీరామ అంటూ కోటి తలంబ్రాలు సమర్పించారు. రానున్న శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో జరితే రాముల వారి కళ్యాణానికి ఈ వడ్ల గింజలు గోటితో వలిచి భద్రాద్రి, అయోధ్య, ఒంటిమిట్ట వంటి రాముల వారి క్షేత్రాలకు కళ్యాణానికి తలంబ్రాల ఇక్కడి నుంచే పంపించడం ఆనవాయితీగా వస్తుంది. రాములోరి కళ్యాణానికి ప్రతి ఏటా రసాయన ఎరువులు వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో వరి పంటను పండిస్తారు.