భర్త తనకు నచ్చిన షర్ట్ వేసుకోలేదని.. ఆత్మహత్య చేసుకున్న భార్య

దిశ, వెబ్ డెస్క్: అప్పుడప్పుడు ఆలుమగల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. వాటిని పెద్దదిగా చేసుకోకుండా ఒకరికొకరు సర్ధి చెప్పుకుంటే అంతా సద్దుమణుగుతుంది. కానీ, కొందరు గొడవలు జరిగిన సందర్భంలో క్షణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వారి నూరేళ్ల జీవితానికి అర్ధాంతరంగా ముగింపు పలుకుతున్నారు. గొడవకు పరిష్కారమార్గం వెతుక్కోకుండా ఆత్మహత్మలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. తన భర్త తనకు నచ్చిన షర్ట్ వేసుకోలేదని ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ […]

Update: 2021-10-27 01:49 GMT

దిశ, వెబ్ డెస్క్: అప్పుడప్పుడు ఆలుమగల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. వాటిని పెద్దదిగా చేసుకోకుండా ఒకరికొకరు సర్ధి చెప్పుకుంటే అంతా సద్దుమణుగుతుంది. కానీ, కొందరు గొడవలు జరిగిన సందర్భంలో క్షణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వారి నూరేళ్ల జీవితానికి అర్ధాంతరంగా ముగింపు పలుకుతున్నారు. గొడవకు పరిష్కారమార్గం వెతుక్కోకుండా ఆత్మహత్మలు చేసుకుంటున్నారు.

ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. తన భర్త తనకు నచ్చిన షర్ట్ వేసుకోలేదని ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అక్కడ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శుభమ్-అంజలి అనే వీరు భార్యాభర్తలు. వీరికి వివాహమై రెండేళ్లయ్యింది. కోటలోని ఆర్కేపురంలో వీరు నివసిస్తున్నారు. అయితే, శుభమ్ కోటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను ఇటీవల సాధారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో తన భార్య అంజలి తనకు నచ్చిన షర్ట్ వేసుకొని బయటకెళ్లాలని శుభమ్ ను కోరింది. అందుకు శుభమ్ నిరాకరించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. అది కాస్త గాలివానగా మారింది. దీంతో అతను భార్యపై అసహనం వ్యక్తం చేస్తూ అన్నం తినకుండానే ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లిపోయాడు. తన భర్త అసహనం వ్యక్తం చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన అంజలి.. క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుభమ్ డ్యూటీ నుంచి తిరిగొచ్చేసరికి ఇంట్లో అంజలి విగతజీవిగా ఉండడాన్ని చూసి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ.. ఇంత చిన్న విషయానికి అంజలి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News