ఉల్లికాడలతో నెయిల్ ఆర్టా?… ఇదెక్కడి ఫ్యాషన్
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం ఫ్యాషన్ రంగంలో ముందుకు దూసుకుపోతుంది. కొత్త, కొత్త ఆవిష్కరణలతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నారు. ఐతే ఈ ఫ్యాషన్ కొంతవరకు ఒకే అనిపిస్తున్నా.. మరికొన్ని సార్లు ఎబెట్టుగా అనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఏంటి ఇది ఫ్యాషనా? అని ఆశ్చర్యం కలుగుతుంది కూడా. ఇప్పుడున్న కాలంలో అమ్మాయిలు తలకు పెట్టుకునే క్లిప్ నుండి కాలికి వేసుకొనే షూ వరకు అంతా డిఫరెంట్ ఫ్యాషన్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో నెయిల్ ఆర్ట్ అనేది చాలా […]
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం ఫ్యాషన్ రంగంలో ముందుకు దూసుకుపోతుంది. కొత్త, కొత్త ఆవిష్కరణలతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నారు. ఐతే ఈ ఫ్యాషన్ కొంతవరకు ఒకే అనిపిస్తున్నా.. మరికొన్ని సార్లు ఎబెట్టుగా అనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఏంటి ఇది ఫ్యాషనా? అని ఆశ్చర్యం కలుగుతుంది కూడా. ఇప్పుడున్న కాలంలో అమ్మాయిలు తలకు పెట్టుకునే క్లిప్ నుండి కాలికి వేసుకొనే షూ వరకు అంతా డిఫరెంట్ ఫ్యాషన్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో నెయిల్ ఆర్ట్ అనేది చాలా ప్రత్యేకం.
గోళ్ళ సౌదర్యం కోసం వేలు వేలు ఖర్చులు పెట్టే అమ్మాయిలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ నెయిల్స్ కి ఎంతో ఆకర్షణీయంగా నెయిల్ పెయింట్ వేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ ఫ్యాషన్ తెలిసిన వాళ్ళు వాటికి బొమ్మలు , స్టికర్లు అతికిస్తూ ఉంటారు. కానీ నదియా ఇలిజం అనే యువతీ మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్లి గోళ్లకు పళ్ళ తొక్కలతో నెయిల్ ఆర్ట్ ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఉల్లిపాయ, ఫైనాఫిల్ తొక్కలతోనే కాకుండా కాండిల్స్, కలర్ లీవ్స్ తో రకరకాల నెయిల్ ఆర్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇక వీటిపై కొంతమంది నెటిజన్స్ అమ్మాయి ప్రతిభను పొగుడుతుంటే మరికొంతమంది నెటిజన్స్ పిచ్చి పలు రకాలు.. అందులో ఇది ఒకటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.