‘ఎమ్మెల్యే కుమారుడితో ప్రాణహాని..’

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవతో త‌న‌కు ప్రాణ‌హాని ఉందని పాల్వంచ మండలం నవభారత్‌కు చెందిన ఓ మహిళ.. మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌కు‌ ఫిర్యాదు చేసింది. రాఘ‌వ‌ త‌న‌ను లోబ‌ర్చుకునేందుకు య‌త్నించ‌గా, తాను లొంగ‌క‌పోవ‌డంతో క‌క్ష పెంచుకున్నాడని సదరు మ‌హిళ మంత్రి వ‌ద్ద ఆరోపించారు. ఏప్రిల్ 15న త‌న‌పై రాఘ‌వ అనుచ‌రులు ఓ మ‌హిళతో పాటు మొత్తం 12మంది తనపై దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపించింది. ఈ దాడిలో తాను తీవ్రంగా గాయపడినట్టు […]

Update: 2020-05-25 06:05 GMT

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవతో త‌న‌కు ప్రాణ‌హాని ఉందని పాల్వంచ మండలం నవభారత్‌కు చెందిన ఓ మహిళ.. మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌కు‌ ఫిర్యాదు చేసింది. రాఘ‌వ‌ త‌న‌ను లోబ‌ర్చుకునేందుకు య‌త్నించ‌గా, తాను లొంగ‌క‌పోవ‌డంతో క‌క్ష పెంచుకున్నాడని సదరు మ‌హిళ మంత్రి వ‌ద్ద ఆరోపించారు. ఏప్రిల్ 15న త‌న‌పై రాఘ‌వ అనుచ‌రులు ఓ మ‌హిళతో పాటు మొత్తం 12మంది తనపై దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపించింది. ఈ దాడిలో తాను తీవ్రంగా గాయపడినట్టు మహిళ వాపోయింది. దాదాపు 24 రోజుల పాటు ఖ‌మ్మంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన‌ట్లు తెలిపింది. అయితే ఈ దాడిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయగా, కేవ‌లం ముగ్గురిని మాత్ర‌మే అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారని, మిగ‌తా వారిని అరెస్ట్ చేయ‌డం లేద‌ని సదురు మహిళ మంత్రికి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పాల్వంచ డీఎస్పీ, కొత్త‌గూడెం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని మంత్రి ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ.. బాధితురాలికి ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. నిందితులు ఎంత‌టి వారైనా స‌రే.. వ‌దిలిపెట్టేది లేద‌ని, చ‌ట్టం అంద‌రికీ ఒకే విధంగా ప‌నిచేస్తుంద‌న్నారు. బాధిత మ‌హిళ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని ఎస్పీ సునీల్ ద‌త్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అవ‌స‌ర‌మైతే తాను స్వ‌యంగా డీజీపీతో మాట్లాడి బాధితురాలికి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు.

Tags:    

Similar News