అతి చనువే ఆయువు తీసిందా..?

దిశ, దుబ్బాక : దుబ్బాక మండలం రాజక్కపేట మధిర గ్రామమైన ఎల్లాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి కుక్కల చంద్రకళ (30)అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దుబ్బాక ఎస్సై మన్నే స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ‌ను దుంపలపల్లి గ్రామానికి చెందిన రవి కి ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో చంద్రకళ చనువుగా ఉండటం‌తో గత […]

Update: 2021-10-16 08:58 GMT

దిశ, దుబ్బాక : దుబ్బాక మండలం రాజక్కపేట మధిర గ్రామమైన ఎల్లాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి కుక్కల చంద్రకళ (30)అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దుబ్బాక ఎస్సై మన్నే స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ‌ను దుంపలపల్లి గ్రామానికి చెందిన రవి కి ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో చంద్రకళ చనువుగా ఉండటం‌తో గత కొద్ది రోజుల క్రితం గ్రామంలోని పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి ఈ సంసారాన్ని చక్క పెట్టారు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో శుక్రవారం దసరా పండుగ సందర్భంగా తల్లిగారింటికి వచ్చిన చంద్రకళ ను రమేష్ అనే వ్యక్తి తీవ్రంగా దూషించి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రకళ తన పుట్టింట్లో శుక్రవారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్ పై కేసు నమోదు చేశామని ఎస్సై స్వామి తెలిపారు.

Tags:    

Similar News