శోభనం రాత్రి గొడవ.. యువతి ఆత్మహత్యాయత్నం !
దిశ, వెబ్‌డెస్క్: ఫస్ట్ నైట్ రోజు దంపతుల మధ్య జరిగిన గొడవతో యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కట్రేనికోనా మండలం బొట్టుచెరువు గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి జగద్గిరిగుట్టలోనివాసం ఉంటోంది. మేస్త్రీ పని చేసే యజమాని పెద్ద కూతురు (24)కు ఈనెల 6న వివాహం జరిపించారు. ఈనెల 9వ తేదీన వారికి శోభనం ఏర్పాట్లు చేశారు. ఉదయం బయటకు […]
దిశ, వెబ్‌డెస్క్: ఫస్ట్ నైట్ రోజు దంపతుల మధ్య జరిగిన గొడవతో యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కట్రేనికోనా మండలం బొట్టుచెరువు గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి జగద్గిరిగుట్టలోనివాసం ఉంటోంది. మేస్త్రీ పని చేసే యజమాని పెద్ద కూతురు (24)కు ఈనెల 6న వివాహం జరిపించారు.
ఈనెల 9వ తేదీన వారికి శోభనం ఏర్పాట్లు చేశారు. ఉదయం బయటకు వచ్చిన వరుడు.. వధువు కుటుంబ సభ్యులతో ‘ మీ అమ్మాయి నా మాట వినడం లేదు. మా బంధువులను పిలిచి మాట్లాడుదాం అని చెప్పాడు. ఇదేక్రమంలో మార్నింగ్ టిఫిన్స్ చేసిన తర్వాత మళ్లీ ఇదే విషయంపై చర్చిస్తుండగా బెడ్ రూమ్‌లోకి వెళ్లిన యువతి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి.. యువతిని ఆస్పత్రికి తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శోభనం రోజు రాత్రి జరిగిన గొడవ కారణంగానే యువతి ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.