అలంపూర్‌లో వైన్ షాపులు సీజ్
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకలో వైన్ షాపులను సీజ్ చేస్తున్నామని సీఐ పటేల్ భానోత్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో కూడా అధికారుల కళ్లుగప్పి మద్యం అమ్ముతున్నానే సమాచారం మేరకు తాలూకాలోని అన్ని వైన్ షాపులను సీజ్ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ఎవరైనా బెల్టుషాపులు నిర్వహిస్తే సమాచారం అందించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మనకు మనం కాపాడుకుంటూ ఇతరులకు […]
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకలో వైన్ షాపులను సీజ్ చేస్తున్నామని సీఐ పటేల్ భానోత్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో కూడా అధికారుల కళ్లుగప్పి మద్యం అమ్ముతున్నానే సమాచారం మేరకు తాలూకాలోని అన్ని వైన్ షాపులను సీజ్ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ఎవరైనా బెల్టుషాపులు నిర్వహిస్తే సమాచారం అందించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మనకు మనం కాపాడుకుంటూ ఇతరులకు కరోనా సోకకుండా ఉండాలంటే ఇంట్లోనే ప్రతి ఒక్కరు ఉండాలన్నారు.