ఇరాక్‌లో 2,700 ఏళ్ల నాటి వైన్ ప్రెస్..

దిశ, ఫీచర్స్ : పురాతన కాలానికి చెందిన మరో ఆవిష్కరణ ప్రపంచానికి పరిచయమైంది. ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తలు ఉత్తర మెసొపొటేమియా(ఆధునిక ఇరాక్)లో ప్రాచీన పారిశ్రామిక వైన్ ప్రెస్‌ను కనుగొన్నారు. దీన్ని బట్టి పురాతన సామ్రాజ్యాల్లో ఒకటైన అస్సిరియన్ కాలం నుంచే ప్రజలు వైన్ సేవనాన్ని తమ జీవనంలో భాగంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర మెసొపొటేమియాలో 2,700 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి పురాతన, పారిశ్రామిక వైన్ ప్రెస్ ఇదే కావచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని […]

Update: 2021-11-05 03:08 GMT

దిశ, ఫీచర్స్ : పురాతన కాలానికి చెందిన మరో ఆవిష్కరణ ప్రపంచానికి పరిచయమైంది. ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తలు ఉత్తర మెసొపొటేమియా(ఆధునిక ఇరాక్)లో ప్రాచీన పారిశ్రామిక వైన్ ప్రెస్‌ను కనుగొన్నారు. దీన్ని బట్టి పురాతన సామ్రాజ్యాల్లో ఒకటైన అస్సిరియన్ కాలం నుంచే ప్రజలు వైన్ సేవనాన్ని తమ జీవనంలో భాగంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర మెసొపొటేమియాలో 2,700 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి పురాతన, పారిశ్రామిక వైన్ ప్రెస్ ఇదే కావచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని తొలి సామ్రాజ్యాల్లో ఒకటైన అస్సిరియా మెసొపొటేమియాకు ఉత్తర భాగంలో ఉండగా.. ఆధునిక ఇరాక్‌లోని ఎక్కువ భాగంతో పాటు ఇరాన్, కువైట్, సిరియా, టర్కీలోని కొన్ని ప్రాంతాలు ఇందులో భాగం. ఇక శాస్త్రవేత్తలు ఈ భూభాగంలో వైన్ ఉత్పత్తి ప్రాంతాన్ని గుర్తించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆర్కియోబొటానికల్ అవశేషాలు కూడా ఆ టైమ్‌లో ఈ ప్రాంతంలోని ద్రాక్షతోటల విస్తరణను చూపించాయి. ఈ ఆవిష్కరణలో పర్వతపు రాళ్లలో చెక్కిన 14 సంస్థాపనలు ఉండగా.. సమీపంలో స్క్వేర్, సర్కిల్ బేసిన్లు ఉన్నాయి. దీని ప్రకారం ఎగువన గల చతురస్రాకారపు బేసిన్స్‌లో ద్రాక్షను పాదాలతో తొక్కేందుకు ఉపయోగించగా.. దిగువన ఉన్న వృత్తాకార బేసిన్స్‌లోకి చేరుకున్న ద్రాక్ష రసాన్ని జాడీల్లో సేకరించి, పులియబెట్టి పెద్ద ఎత్తున విక్రయించేవారు. దోహుక్‌లోని పురాతన వస్తువుల అధికారుల సహకారంతో ఉడిన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ స్థలాన్ని కనుగొన్నారు. ఈ పురాతన నిర్మాణాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చే పనిలో బృందాలు నిమగ్నమయ్యాయి.

అస్సిరియన్ గ్రంథం.. గతంలో తమ సామ్రాజ్యంలో వైన్‌‌కు ఉన్న డిమాండ్‌ను సూచించింది. ముఖ్యంగా రాజ్య సభ్యులు, ప్రముఖులతో పాటు ధనికులు వారి ఆచార వ్యవహారాలలో వైన్‌ను విస్తృతంగా ఉపయోగించారని అందులో పేర్కొనబడింది. కాగా అస్సిరియన్ కాలం చివరన 8, 7వ శతాబ్దపు BC మధ్య వైన్ డిమాండ్ మరింత పెరిగింది.

Tags:    

Similar News