BJP: గిరిజన విద్యార్థిని మరణం ప్రభుత్వ హత్యే.. బీజేపీ తెలంగాణ సంచలన ఆరోపణలు

గిరిజన విద్యార్థిని శైలజ(Tribal Student Shailaja) మరణం(Death) ప్రభుత్వ హత్యేనని బీజేపీ తెలంగాణ(BJP Telangana) సంచలన ఆరోపణలు(Sensational Allegations) చేసింది.

Update: 2024-11-26 09:31 GMT

దిశ, వెబ్ డెస్క్: గిరిజన విద్యార్థిని శైలజ(Tribal Student Shailaja) మరణం(Death) ప్రభుత్వ హత్యేనని బీజేపీ తెలంగాణ(BJP Telangana) సంచలన ఆరోపణలు(Sensational Allegations) చేసింది. వాంకిడి గురుకుల విద్యాలయం(Wankidi Gurukul Vidyalayam)లో ఫుడ్ పాయిజన్(Food Poison) అయ్యి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజా అనే విద్యార్థిని సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై తల్లిదండ్రులకు మృతదేహం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించిందని, బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే(Sirpur MLA) డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(Dr. Palvai Harish Babu) జోక్యంతో శైలజ పార్థివదేహాన్ని తమ కుటుంబానికి అప్పజెప్పి సొంత ఊరికి తరలించడం జరిగిందని తెలిపింది.

అలాగే గురుకులాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ జరిగినా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ రోజు శైలజ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించింది. అంతేగాక గురుకులాల్లో పెట్టే ఆహారం తిని అనేక మంది పిల్లలు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుత్రిలో చేరగా.. శైలజ పరిస్థితి విషమించిందని, 25 రోజులుగా నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో నరకం అనుభవించి ప్రాణాలు విడిచిందని వివరించింది. ఇక అధికారంలో ఉన్నపటికీ ఇన్ని రోజులుగా ఏ కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యే, ఎంపీ, నాయకులు శైలజను కలవడానికి రాలేదని, కనీసం పట్టించుకోలేదని విమర్శించింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, దీనికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి సీతక్క(Minister Seethakka) రాజీనామా(Resign) చేయాలని, కడు పేదరికంలో మరుగుతున్న శైలజ కుటుంబానికి ఆర్థిక సాహయం అందించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారని రాసుకొచ్చింది.

Tags:    

Similar News