Minister Lokesh : ప్రతి విద్యార్థికి బాలల భారత రాజ్యాంగం : మంత్రి లోకేష్
75ఏండ్ల భారత రాజ్యాంగం(Indian Constitution)స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు భావిభారత పౌరులైన ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు విద్యా శాఖ ద్వారా వచ్చే ఏడాది నుంచి బాలల భారత రాజ్యాంగం పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Lokesh)వెల్లడించారు.
దిశ, వెబ్ డెస్క్ : 75ఏండ్ల భారత రాజ్యాంగం(Indian Constitution)స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు భావిభారత పౌరులైన ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు విద్యా శాఖ ద్వారా వచ్చే ఏడాది నుంచి బాలల భారత రాజ్యాంగం పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్(Minister Lokesh)వెల్లడించారు. 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల సమావేశంలో సీఎం చంద్రబాబుతో కలిసి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఐఏఎస్ లు, హోం సెక్రటరీ మినహా ఐపీఎస్ లు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో రాజ్యాంగం విలువ ఎంటో తెలుసుకున్నానని, రాజ్యాంగాన్ని చేత పట్టుకుని నాటి నియంతృత్వ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తూ యువగళం పాదయాత్ర చేశానని, ఈ సందర్భంగా భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్ర్యం హక్కులు ఎంత ముఖ్యమైందో అవగతమైందన్నారు.
వైసీపీ పాలనలో పోలీసు అధికారులు రాజ్యాంగ హక్కులకు అనుగుణంగా వ్యహరించలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగం విలువను అంతా గుర్తించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ పేరుతో విద్యార్థులకు రాజ్యాంగం అంశాలతో కూడిన ప్రత్యేక పుస్తకాలను పంపిణీ చేస్తామని ప్రాథమిక హక్కులు, ఇతర అంశాల గురించి విద్యార్థి దశ నుండే సులభంగా అర్ధం అయ్యేలా చెయ్యడమే ఈ పుస్తకం లక్ష్యమని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని అన్నారు.
Also Read:
Pavan Kalyan: ఆర్జీవీ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు