Pavan Kalyan: ఆర్జీవీ కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆచూకీ కోసం ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు (AP Police) రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆచూకీ కోసం ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు (AP Police) రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒక టీమ్ హైదరాబాద్ (Hyderabad)లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamshabad)లో గాలిస్తుండగా.. మరో టీమ్ తమిళనాడు (Tamilnadu)లోని కోయంబత్తూరు (Coimbatore)లో గాలిస్తోంది. ఈనెల 23న కోయంబత్తూరు (Coimbatore)లో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఆర్జీవీ (RGV) పోస్టు పెట్టగా.. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయంబత్తూరు (Coimbatore) పోలీసుల సహకారం తీసుకుని ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నారు.
కాగా, విచారణకు రావాలంటూ ఇప్పటికే రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే, ఆయన విచారణకు రెండు సార్లు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ (RGV) అరెస్ట్‌పై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) స్పందించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రామ్‌గోపాల్ వర్మ విషయంలో పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తారని అన్నారు. లాం అండ్ ఆర్డర్ (Law & Order), హోం శాఖ (Home Department)లు తన దగ్గర లేవని కామెంట్ చేశారు. పోలీసుల తీరును సీఎం చంద్రబాబు, హోం మినిస్టర్ అనిత దృష్టికి తీసుకెళ్తానని పవన్ అన్నారు.
Also Read: