CM Chandrababu Nayudu : 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్ల ఏర్పాటు : సీఎం చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతి(Amaravathi)లో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని(Deep Technology Iconic Building) నిర్మించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu) ప్రకటించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి(Amaravathi)లో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్ని(Deep Technology Iconic Building) నిర్మించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu) ప్రకటించారు. మంగళవారం తన ఛాంబర్లో కొత్త ఐటీ పాలసీ(New IT Policy) ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. రానున్న 5 ఏళ్లల్లో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లను(IT Work Stations) అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. స్టార్ట్ అప్ కంపెనీలకు రూ.25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతలో స్కిల్స్ పెంచే కార్యక్రమాలను విరివిగా చేపడతామని తెలియజేశారు.
Also Read:
Kharge: అదే జరిగితే సర్కార్ కూలడం ఖాయం.. ఖర్గే నోట చంద్రబాబు పేరు