Fish oil: మార్కెట్‌లోకి ఫిష్ ఆయిల్.. జుట్టుకు మంచిదేనా..!!
చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది
దిశ, వెబ్‌డెస్క్: చేపలు(Fish) తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేపల్లో ఉండే విటమిన్లు(Vitamins), విటమిన్ డి, బి (Vitamin D) చేపల ఆహారంలో పుష్కలంగా ఉంటాయి. ఇది మన భోజనంలో కార్బోహైడ్రేట్ల(carbohydrates) విచ్ఛిన్నానికి సహాయపడుతుంది. ఎముక ఆరోగ్యానికి(bone health) విటమిన్ డి ఎంతో ఉపయోగపడుతుంది. B2 చర్మం(skin), రక్త కణాలు(Blood cells), శక్తి స్థాయిల(Energy levels)ను చూసుకుంటుంది. చేపలో ఉండే ఒమేగా -త్రీ(Omega-3) కొవ్వు ఆమ్లాలు (Fatty acids) ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఫ్యాటీ యాసిడ్స్(Fatty acids)తో తయారుచేసి.. మార్కెట్‌లో క్యాప్సిల్స్(capsules) రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ క్యాప్సిల్స్ హెయిర్ ఒత్తుగా(Hair thick) పెంచడంలో తోడ్పడుతుంది. అయితే క్యాప్సిల్స్ కాకుండా ఇది ఆయిల్ కూడా మార్కెట్‌లో దొరుకుతుంది.
కాగా ఈ నూనె హెయిర్ కు రాస్తే లాభాలే తప్ప నష్టాలేం లేవంటున్నారు నిపుణులు. జుట్టుకు చేప నూనే రాస్తే తలలో బ్లడ్ సర్కులేషన్(Blood circulation) సాఫీగా సాగుతుంది. దీంతో కుదుళ్లు స్ట్రాంగ్ గా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు(Antioxidants) ఫ్రీ రాడికల్స్(Free radicals) హానికరమైన ప్రభావాల నుంచి మీ కణాలను కాపాడుతాయి. వైట్ హెయిర్(White hair) రాకుండా ఉంటుంది. ఫిష్ ఆయిల్ ఆక్సీకరణ ఒత్తిడి(Oxidative stress)ని తగ్గిస్తుంది. యవ్వనంగా ఉంచడంలో పాటు హెయిర్ నల్లగా(Hair black) మారుతుంది. హెయిర్ ఫాల్(Hair fall) ను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఫిష్ ఆయిల్ ఉన్న DHA, EPA, శక్తివంతమైన కొవ్వు ఆమ్లాలు(Powerful fatty acids) హెయిర్ రాలిపోకుండా చేస్తాయి. అంతేకాకుండా దీనిలో ఉండే ఒమేగా-3 తల చర్మంపై ఓదార్పు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చికాకును తగ్గిస్తుంది. హెయిర్ చిట్లిపోవడం() వంటి ప్రాబ్లమ్ కు చెక్ పెడుతుంది.