ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు
ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని ఈఎంఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేశారు
దిశ, అచ్చంపేట రూరల్: ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని ఈఎంఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ లను తమ వెంట తీసుకుని నాగర్ కర్నూల్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లోని 108 ఆఫీస్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు హాజరు పరచాలని తెలిపారు. ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణలో ఎక్కడైనా పనిచేయుటకు సిద్ధంగా ఉండాలని వారు తెలియజేశారు.అదేవిధంగా ఇతర సమాచారం కొరకు 9100799260 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.