ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నం...!
అభం శుభం తెలియని ఓ చిన్నారిపై ఓ కామాంధుడు
దిశ, నారాయణపేట క్రైమ్: అభం శుభం తెలియని ఓ చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేశాడు. పెళ్లి జరిగి సంతానం ఉన్నా కూడా కనీసం జాలి...కరుణ లేకుండా తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తన ఇంట్లోపై భవనంలో ఓ కుటుంబం అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి మర్మాంగాన్ని కోరికినట్లు సమాచారం. అయితే చిన్నారి అరవడంతో కుటుంబ సభ్యులు తేరుకొని విషయాన్ని గమనించగా..చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించాడని ఓ చోట గాయమైన విషయాన్ని గుర్తించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు నారాయణపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అఘాయిత్యానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగనుంది.