Ganguly : గంగూలీ కూతురు సనాకు తప్పిన పెను ప్రమాదం..

భారత మాజీ కెప్టెన్ గంగూలీ కూతురు సనాకు పెను ప్రమాదం తప్పింది శుక్రవారం సాయంత్రం కోల్‌కతా డైమండ్ హర్బర్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది.

Update: 2025-01-04 05:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత మాజీ కెప్టెన్ గంగూలీ కూతురు సనాకు పెను ప్రమాదం తప్పింది శుక్రవారం సాయంత్రం కోల్‌కతా డైమండ్ హర్బర్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ కారు నడపుతుండగా సనా పక్క సీటులో కూర్చున్నారు. డైమండ్ బెహలా చౌరస్తా వద్ద వారు ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. అయితే బస్సుతో సహా డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. కారు డ్రైవర్‌ను బస్సును వెంబడించి కొంత దూరం వెళ్లిన తర్వాత అడ్డగించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సనా ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా దెబ్బతింది. బస్సు ఆపగానే సనా లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు. బెహలా పోలీసు స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News