Tamil Nadu assembly: తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా.. గవర్నర్ వాకౌట్
తమిళనాడు అసెంబ్లీలో(Tamil Nadu assembly) హై డ్రామా నడిచింది. శీతాకాల సమావేశాల తొలిరోజే గవర్నర్(Tamil Nadu Governor) ఆర్ ఎన్ రవి(RN Ravi) సంప్రదాయ ప్రసంగం చేయకుండా వాకౌట్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీలో(Tamil Nadu assembly) హై డ్రామా నడిచింది. శీతాకాల సమావేశాల తొలిరోజే గవర్నర్(Tamil Nadu Governor) ఆర్ ఎన్ రవి(RN Ravi) సంప్రదాయ ప్రసంగం చేయకుండా వాకౌట్ చేశారు. అంతేకాకుండా, ప్రతిపక్షాలు(Opposition parties) అసెంబ్లీలో నిరసనలు చేపట్టాయి. అసెంబ్లీ తొలి సెషన్‌లో జాతీయ గీతాన్ని అవమానించారని గవర్నర్ ఆరోపించారు. “గవర్నర్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత సాంప్రదాయకంగా జాతీయగీతాన్ని వాడుతారు. జాతీయ గీతానికి బదులుగా ‘తమిళ తాయ్ వజ్తు’ అనే రాష్ట్ర గీతాన్ని మాత్రమే ప్రదర్శించారు. రాజ్యాంగం, జాతీయ గీతానికి జరిగిన అవమానం పట్ల గవర్నర్ రవి వేదనకు గురయ్యారు. అందుకే, తీవ్ర వేదనతో శాసనసభను విడిచిపెట్టివెళ్లారు” అని రాజ్‌భవన్ ప్రకటన తెలిపింది. గవర్నర్ సభకు వచ్చినప్పుడు, కేవలం ‘తమిళ తాయ్ వజ్తు’ గీతాన్ని మాత్రమే ఆలపించారు. అయితే, జాతీయగీతాన్ని వినిపించాల్సిందగా రాజ్యాంగ కర్తవ్యాన్ని గవర్నర్ గుర్తుచేశారని రాజ్ భవన్ ప్రకటనలో తెలిపింది. స్పీకర్ కు, సీఎంకు జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరినప్పటికీ వారు సున్నితంగా తిరస్కరించాలని వెల్లడించింది.
అన్నా వర్సిటీ లైంగిక వేధింపులు
ఇకపోతే, అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఏఐఏడీఎంకే అసెంబ్లీలో నిరసన ప్రదర్శించింది. "యార్ అంత సర్" (ఎవరు 'సార్') అని రాసి ఉన్న బ్యాడ్జీలు, ప్లకార్డులను ప్రదర్శించింది. బాధితురాలికి న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు, నాయకులు ఆందోళన చేపట్టారు. ఇదే అంశంపైన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు.